Monday, November 3, 2008

తెలంగాణ కాంగ్రెస్ నేతలారా!వేలు మనదే..కన్నూ మనదేనా!!

తెలంగాణ కాంగ్రెస్ నేతలారా!
వేలు మనదే..కన్నూ మనదేనా!!

తెలంగాణ కాంగ్రెస్ నాయకులారా! మీకు ఓట్లేసి అందలమెక్కించిన ప్రజల పక్షాన నిలదీస్తునాం-
మీ చర్యలు పాలకులకు సపర్యలుగా మారలేదా? తెలంగాణ కు మేం వ్యతిరేకం కాదంటూనే ప్రత్యేక తెలంగాణ మరుగన పరిచేందుకు వైఎస్ కి పావులుగా మారడం నిజం కాదా? మీరు నిజంగానే తెలంగాణ బిడ్డలైతే, ఆత్మ విమర్శ చేసుకుని తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల పక్షాన నిలుస్తారో లేదో తేల్చుకోండి?
అభివృద్ది స్వయంపాలనకు ప్రత్యామ్నాయం కాదని తెలంగాణ ప్రజలు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. వైఎస్ బూటకపు అభివృద్దిని చూపి తెలంగాణ ఆకాంక్షని అణచివేసేందుకు మీరు పావులుగా మారడము సమంజసమా? మన వేలుతో మన కంటిని పొడుచుకోవడము కాదా ఇది? తెలంగాణ మంత్రులారా,MLA లు, నాయకులారా! మరో సారి ఆలోచించండి.. ఆత్మ ప్రభోదం ప్రకారం నడుచుకోండి..

"జై తెలంగాణ పార్టీ" పెట్టి ఆ ఆశయ సాదనలోనే ఇంద్రారెడ్డి మరణిస్తే ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సబితమ్మా! ఇపుడు అందుకు పూర్తి విరుద్దంగా వైఎస్ కి మద్దతు ఇవ్వడము ఇంద్రన్న ఆశయాలకు గోరి కట్టడము కాదా?ఇందుకు ఇంద్రన్న ఆత్మ క్షోభించదా?
1969 లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వీరమాత ఈశ్వరీభాయి వారసత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం గీతారెడ్డికి మంచిదేనా? ఆ తల్లి ఆత్మక్షోభ నిన్ను తాకాదా?
ఎన్నికలకు ముందు వైఎస్ ని "సైమన్ గో బ్యాక్" అంటూ నినదించినా చిన్నారెడ్డీ! మంత్రి పదవి రాగానే వైఎస్ సైమన్ "గాందీ" అయినాడా? అపుడు "వై" అన్నవాడివి ఇపుదు "ఎస్" అనడము ఆత్మవంచన కాదా?
జాన్ పాడ్ పేరు పెట్టుకున్న జానా రెడ్డీ! హొం మంత్రిగా కోత్వాల్ "టోపి" పెట్టి "లాఠి" తనతోనే వుంచుకుని రిపోర్టుల సంగతి నీకేం తెలుసనని ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రజలకు అవమానంగా ఉంది....

నీకు అవమానం అనిపించడము లేదా? జీవన్ రెడ్డీ! నాలుగు లక్షల తెలంగాణ పోరు బిడ్డల చేతిలో ఓడిపోయి మళ్లీ మళ్లీ మంత్రి పదవి తెచ్చుకున్నావు? తెలంగాణ ప్రజల ఆకాంక్షని మానేట్లో ముంచి తెప్ప తగలేస్తున్నావా?
వేల కొద్దీ వక్ఫ్ భూముల్ని కోస్తా వాళ్లకు అమ్ముతుంటే ప్రతిఘంటించక పోగా సమర్తించుకునే నీవూ ముస్లీముల ప్రతినిదివెట్లావుతావు షబ్బీర్ బాబా?
పొన్నాలా! కృష్ణా నీళ్లను పోతిరెడ్డిపాడుకు, గోదవరి నీళ్లను కోస్తాకు... నీ చేతుల మీదుగా దారపొయడానికేనా నీళ్ల మంత్రి అయింది?
ఇపుడన్నా ఇడుపులపాయ మాయనుండి బయటపడండి...మీ మాయిమంతా తెలంగాణలోనే ఉంటే జర తెలంగాణ తల్లి గోస తీర్చుండ్రి. తెలంగాణ కోసం సావో రేవో తేల్చుకోండ్రి. తెలంగాణ తల్లి బిడ్డలమని నిరూపించుకోండి.

(source from --"సింగిడి" తెలంగాణ రచయితల సంగం - andhrajyothy - Nov 04 08)

1 comment:

Kiran Kusumba said...

this is great...idi print chesi gandhi bhavan lo panchali..