Tuesday, November 11, 2008

తెలంగాణా కిరణం

అవ్వా...! అదిగో చూడే మండుతున్న ఆ సూర్యుడి నుండి నిప్పురవ్వలా వస్తున్న ఆ తెలంగాణా కిరణం !
మబ్బుల చాటుకున్న దోపిడీ దొంగల్నితరుముకుంటూ...ఎత్తైన ఆ చెట్ల కున్న పచ్చని ఆకుల మధ్య నుండి పొడుచుకుంటూ యెన్నాల్ల నుండో కారు చీకట్లో కాలం వెల్లదీస్తున్న మన బతుకుల్లో వెలుగులు జిమ్ముతూ...
గోదావరి నీటి పై తళ తళ మెరుస్తూ కృష్ణమ్మ తల్లి కి పసుపు కుంకుమలు రాస్తూ ముక్కోటి ముద్దు బిడ్డల ముద్దుల తల్లి"తెలంగాణా వీణ" పై నాట్యమాడుతూ...
పల్లె కన్నీటి కథలకు వీడ్కోలు పలుకుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ బతుకుతున్నవెట్టి చాకిరి బతుకులకు చరమ గీతం పాడుతూ
పక్షుల్లా ఎగురుతూ వెళుతున్న వలస జీవులకు మాతృ భూమి సుగంధ వాసన ల మట్టి పై బంగారు జీవితాలకు పునాది రాయి వేస్తూ మన ఆత్మాభిమానం మిరుమిట్లు గొలిపేందుకు కాంతుల కిరణమై వస్తుంది
అవ్వా..! చూడే అదిగో మన తెలంగాణా కిరణం పరిమళిస్తూ వస్తుంది.
జై తెలంగాణా !! జై జై తెలంగాణా !!!

No comments: