Thursday, November 6, 2008

ఎటుపోతున్నది మన తెలంగాణ పోరాటం?

ఎటుపోతున్నది మన తెలంగాణ పోరాటం? తెలంగాణ ఉద్యమం ఎందుకు పుట్టిందో ఆ కారణాలని, ప్రయోజనాలని విస్మరించి, సెట్లర్లతోనే చేతులు కలిపి దేనికోసం, ఎందుకోసమీ పోరాటం? ఎవరికోసమీపోరాటం? పదవుల కోసమా? అది స్పష్టం చేయాల్సిన బాధ్యత తెలంగాణ నినాదంతో ముందుకొచ్చిన అన్ని పార్టీలకు ఉంది. ఎడారి తెలంగాణో, లేకపోతే సెట్లర్ల తెలంగాణో కాదు మన ప్రజలు కోరుకుంటున్నది. తెలంగాణ ప్రజలకే సొంతమైన పచ్చటి తెలంగాణ, దోపిడీదారుల కబందహస్తాలనుంచి విముక్తి పొందిన తెలంగాణ, మన భాష, మన సంస్కృతి, మన నీరు, మన భూమి, మన వనరులు మనకే సొంతమైన స్వేఛ్ఛా తెలంగాణ మనకి కావల్సింది. దానికి విరుధ్ధంగా తాత్కాలిక ప్రయోజనాల దృష్ట్యా ఎవరు తెలంగాణని, తెలంగాణవాదాన్ని తాకట్టు పెట్టాలని చూసినా ప్రజలు సమర్ధించరు.
ఈ సందర్భంగా కాళోజీని గుర్తుచేసుకోవల్సిన అవసరం ఉంది.
'దోపిడి జేసే ప్రాంతేతరులను
దూరము దాక తన్ని తీరుతాం
ప్రాంతం వాడేదోపిడీ జేస్తే
ప్రాణం తోనే పాతర వేస్తం'

No comments: